ఐసీసీ క్లబ్ ఆధ్వర్యంలో భానుమతి నరసింగ్ రావు మెమోరియల్ ట్రోఫీ సీజన్ 1

ఇచ్చాపురం: భానుమతి నరసింగ్ రావు మెమోరియల్ ట్రోఫీ సీజన్ 1 ఐసీసీ క్లబ్ ఆధ్వర్యంలో ఐసీసీ అధ్యక్షులు దాసరి రాజు మరియు ఐసీసీ క్లబ్ కోచ్ దక్కత గోపి మరియు ఉప్పాడ ఆనంద్ రెడ్డి సమక్షంలో ప్రారంభించడం జరిగినది. మొదటి మ్యాచ్ ఆల్ఫా స్పోర్టింగ్ క్లబ్ వ్స్ టెక్కలి సెంటర్ ఆల్ఫా టోస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ టెక్కలి బ్యాటింగ్ చేసే 178 పరుగులు చేశారు. 2వ ఇన్నింగ్స్ ఆల్ఫా స్పోర్టిగ్ క్లబ్ 154 చేసే 10వికెట్లు కోల్పోయారు. టెక్కలి సెంటర్ 24 పరుగుల తో విజయం సాధించారు. మాన్ ఆఫ్ ద మ్యాచ్ ధనుంజయ 36 పరుగులు చేసి 3 వికెట్స్ తీశారు. బెస్ట్ బ్యాట్స్ మన్ అబిస్కర్ పట్నాయక్ 38 పరుగులు చేశారు. బెస్ట్ బౌలర్ ఘా జి. పి. నాయుడు 4 వికెట్లు తీశారు. మాన్ అఫ్ ది మ్యాచ్ గ్రౌండ్ డెవలప్మెంట్ మెంబర్ బత్తుల వెంకటరమణ చేతుల మీదుగా బహుకరించడం జరిగినది.