జగన్ కౌంటర్ కి జనసేన ఎన్ కౌంటర్

  • పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల రాష్ట్రం అప్పుల ఉబిల్లో కూరుకుపోయిందా..?.

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలో జరిగిన అమ్మ ఒడి పథకంలో బాగంగా బటన్ నొక్కే కార్యక్రమంలో పిల్లల సభలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి, ఆయనపై వ్యక్తిగత విమర్శలను పార్వతీపురం జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం పార్వతీపురం జనసేన నాయకులు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి, ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణకు పాల్పడడం లాంటివి చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అని ప్రశ్నిస్తున్నాము..?. లేకపోతే ఆయన పెళ్లిళ్ల వల్ల రాష్ట్రం అప్పుల ఉబిల్లో కూరుకుపోయిందా..?. రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటి?. అసలు సభ ఉద్ధేశ్యం ఏంటీ?. ఆడుతున్న మాటలు ఏమిటి?. ఏమైనా పొంతనా ఉందా..? పిల్లల భవితవ్యంపై మాట్లాడాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రతిపక్షాలు గురించి, విమర్శంచి మాట్లాడడానికీ ఇది రాజకీయ సభా..?. దీని బట్టి జగన్ కి నైతిక విలువలు ఎంత దిగజారిపోయాయో, అతడివి ఎంతటి దిగజారుడు రాజకీయాలో ప్రస్ఫూటిస్తున్నాయి. ఓ మహనీయుడు చెప్పినట్టు ఎదుట వ్యక్తి నీపై నేరుగా నేగ్గే దమ్ములేనపుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలుపెడతాడు. అన్న మాటలు ఇక్కడ సీఎం జగన్ విషయంలో సాక్షాత్కారిస్తాయి. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడవలసిన వ్యక్తి, సమస్యలపై స్పందించకుండా, స్థానిక సమస్యలు గూర్చి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు, నివేదికలు గూర్చి ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పై వ్యక్తిగత విమర్శ చేయడం అంటే కంటెంట్ ఉన్న వ్యక్తి ని నీవు కంట్రోల్ చేయలేవు. ప్రస్తుత ప్రపంచంలో మచ్చలేని నాయకుల్లో ఆయన ఒకరు. గిరిజన నియోజకవర్గం వెళ్లి, అక్కడ ఇంకా అపరిష్కృతంగా ఉన్న స్థానిక జఠిల సమస్యలు అయిన.. జంఝావతి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకు?. ఐ టీ డీ ఏ…. (పి.ఓ)రాజు ఒక దగ్గర, రాజ్యం(ఐ టీ డీ ఏ) ఒక దగ్గరలా ఉంది. ప్రస్తుత పరిస్థితి. మరి గిరిజనల గోడు వినేది ఎవరు?. పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం?. ఏనుగుల సమస్య?. గిరిజనుల డోలి మోత ఇంకా ఎన్నాళ్ళు?. ఏజెన్సీ గిరిజనులకు సురక్షిత త్రాగునీరు లేక మలేరియా, డైయేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో మరణిస్తున్నారు, మౌలిక సదుపాయాలు లేక సరైన రహదారి రవాణా సౌకర్యాలు లేక అనేక ఇక్కట్లు పడుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన. ఇప్పటికే గిరిజన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉంటే, బోయ వాల్మీకిలను ఎస్.టి జాబితాలో కలపడం. (తమ స్వార్థం కోసం ఓట్ల రాజకీయాలు). గిరిజన యూనివర్సిటీ ఎక్కడ?. నిరుద్యోగ సమస్య?జాబ్ క్యాలెండర్ ఎక్కడ?. ఇలా మున్నగు సమస్యల పట్ల పరిష్కారం దిశగా అడుగులు వేయకుండా,పవన్ కళ్యాణ్ గారిపై,వ్యక్తిగత దాడి చేయడం ఎంత వరకూ సబబు. ప్రపంచంలో విమర్శలను కూడా పేపర్ చూసి చదవడం నిన్నే చూసాము ముఖ్యమంత్రి. ‘వారాహి’ కి వరాహి మద్య తేడా, వ్యత్యాసం కూడా తమరుకు తెలియట్లేదు అంటే, మీరు ఆంధ్ర (తెలుగు)ముఖ్యమంత్రి అయినందుకు అది మా తెలుగు ప్రజల దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ ఉగుతూ మాట్లాడుతాడు అంటావు.. మనం కూడా ఉగుతూ మాట్లాడానికి ఎమోషన్ ఉంటే కదా..?. మనకు తెలుగు రాదు కదా, మనది కర్ణాటక బోర్డర్ కదా? ముసలోలికి, ముతకోలికి ముద్దులు పెట్టడం తప్ప.. నీకు ఆయనలా రావలంటే ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కడిది? ఆర్టిఫిషల్ ఫీలింగ్ తప్ప.! పవన్ కళ్యాణ్ గారికి 4పెళ్ళాలు అంటున్నావు. 4వ పెళ్లం మీ చుట్టాల అమ్మాయా..?. లేక, మీ తాలూకాలో ఎవరికైనా తాళీ కట్టాడా..?. మాకైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నిన్ను ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యమంత్రి చేసింది నీవు రాష్ట్రానికి ఎంతో కొంత ఉద్ధరిస్తావని.. అంతే కానీ, విమర్శలు చేయమని కాదు. విమర్శలు చేస్తే, రాష్ట్ర భవిష్యత్ మారదు. అభివృద్ధి చేస్తేనే మారుతుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ రెడ్డి గుర్తించాలి. ఇక నుంచి విమర్శలు మానుకుని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిశగా బాటలు వేయాలని, ఇలానే కొనసాగితే, సహించేదిలేదని పార్వతీపురం మండల అధ్యక్షురాలు శ్రీ ఆగూరు మణి అన్నారు. విమర్శించడంపై జె.ఎస్.పి యువనాయకులంతా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, బండపల్లి జనార్దన్, అక్కిన భాస్కరరావు, సురేష్, ప్రశాంత్, దుర్గా, వంగపండు సంతోష్, కనకరాజు, చంద్రశేఖర్, పైళ్ల అప్పలరాజు, ఇప్పిలి పోలినాయుడు, పడాల ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.