ఓటర్ల జాబితాల్లో వైసీపీ అక్రమాలు

  • వాలంటీర్లు, గృహసారథుల పేరుతో ప్రతి ఇంటిపై నిఘా పెట్టి తొలగింపు
  • నెల్లూరు సిటీ నియోజకవర్గ ఓటర్ల జాబితాల్లో వేల సంఖ్యలు దొంగ ఓట్లు
  • పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 314వ రోజున 9వ డివిజన్ నవాబుపేట నజీర్ తోట చిన్నబాలయ్య నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి అనే ఊసే లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. వాలంటీర్లు, గృహసారథులు అంటూ ప్రతి ఇంటిపై నిఘా పెట్టిన ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించే పనిలో ఉందని దుయ్యబట్టారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను డబుల్ ఎంట్రీలు వేయడం, వేరే నియోజకవర్గాల నుండి దొంగ ఓట్లు కలిపి ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, త్వరలోనే ఆధారాలతో ఈ అంశాన్ని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు. వైసీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిన నియోజకవర్గంలో ఈసారి జనసేన పార్టీ గెలుపుని ఆపలేరని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-06-30-at-8.56.01-PM.jpeg