మానసిక పరిపక్వత లేని ఉపముఖ్యమంత్రి కి మందు వేసే ప్రయత్నం చేస్తాను

  • ఇది నా సవాల్ అనుకో స్వామి
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్. యుగంధర్ పొన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత లేని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి మందు వేసే ప్రయత్నం చేస్తాను, ఇది నా సవాల్ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పలు ప్రశ్నలు సందించారు. 1. పెనుమూరు మండలంలో రెవిన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. దీనిమీద చర్యలు ఏమైనా తీసుకున్నావా?. ఎందుకు రెవిన్యూ వ్యవస్థను గాడిలో పెట్టలేక పోతున్నావు?. 2. పెనుమూరు మండలంలో నీకు ఒక వ్యతిరేక వర్గం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాకుండా చేయాలని, నువ్వు ఒక అసమర్ధుడు అని, ఒక వేళ సీటు వస్తే నిన్ను ఓడించి ఇంటికి పరిమితం చేయాలనీ చేస్తున్నారు. అది నీకు తెలియడం లేదా?. 3. వెదురు కుప్పఒ మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదు?. 4. రెవిన్యూ లో భూకబ్జాలు కూడా ఎక్కువయ్యాయి? భూకబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి నీ వెనుకబాటుతనానికి కారణం ఏమిటి?. 5. వెదురుకుప్పం మండలం ఎస్సైని ఇంతవరకు ఎందుకు నియమించలేదు? ఎందుకు మాటిమాటికి అధికారులు మారుస్తారు? ఇది నీ చేతగానితనఒ కాదా?. 6. కార్వేటి నగరఒ మండలంలో నీ పక్కన కూర్చున్న వాళ్లను, పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒక సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్న విషయం నీ మతి లోకి రావడం లేదా?. 514 ఎకరాలు చమటోడ్చి, కష్టపడి సంపాదించిన రైతుల కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగించడం నీకు బావ్యమేనా?. డ్యాము పక్కన డ్యామ్ అవసరమా నీకు. అమ్యమ్యాల కోసం అమాయకులను బలి చేస్తున్న స్వామి. 7. సొంత మండలంలో జెడ్పిటిసిగా ఎన్నికైన ఒక మహిళ ఇంతవరకు కార్వేటినగరం మండలంలో ఎక్కడ కనపడలేదు. మీ అధికార జులుం తో అందలం ఎక్కిన ఆ మహిళ ఎక్కడ?. కనపడటం లేదు? ఇలాంటి మహిళ మండలానికి అవసరమా? ఒక అసమర్ధుడైన మంత్రి తన స్వలాభం కోసం ఒక అసమర్ధురాలైన జడ్పిటిసి ఉండడం సిగ్గు చేటు. కష్టపడి పనిచేసిన నీకింది స్థాయి నాయకులకి అన్యాయం చేసిన నువ్వు అధోగతి పాలు కావడం తథ్యం.కార్వేటి నగరం నీ సొంత మండలం. కార్వేటి నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దలేవా? ఆధ్యాత్మిక నగరంగా మార్చలేవా? ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఏమి పీకావు? ఎందుకు ఈ పదవి?. 9. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా చేయలేదంటే నీ అసమర్థత తేటతెల్ల మవుతుంది. 10. ఎస్ ఆర్ పురం మండలంలో నువ్వు సాధించిన ఘనత ఏమిటి? జడ్పిటిసి గా ఎస్సీ కేటగిరికి కేటాయించిన స్థానాన్ని జనరల్ గా మార్చి, నీ భార్యను కార్వేటి నగరానికి జడ్పిటిసి చేయటానికి ఇక్కడున్న జనరల్ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్ కేటగిరీకి మార్చుకున్న మూర్ఖుడివి నువ్వు. 11. 32 గ్రామపంచాయతీలు ఉన్న గంగాధర్ నెల్లూరు మండలంలో నువ్వు సాధించింది ఏమీ లేదు. ఆదర్శ గ్రామంగా ఒక్క గ్రామాన్ని కూడా తీర్చిదిద్దలేదు. ఉద్యోగము లేక సతమతమవుతున్న యువతను ఆదుకోవటానికి ఏ ప్రణాళిక లేని నువ్వు ఏమి సాధించాలని ఎమ్మెల్యే అయ్యావు?. 12. పాలసముద్రం మండలంలో వెంగలరాజు కుప్పం వద్ద ఉన్న బ్రిడ్జి ఇంతవరకు పున:నిర్మాణం చేయలేదు. దానిని ఎప్పుడు రిపేరు చేస్తారు? పతనావస్థకు చేరుకుంది. దీనిమీద ద్రుష్టి పెడితే బాగుంటుంది. 13.: టీవీఎన్ఆర్ పురం గ్రామస్తులు 100 సంవత్సరాలుగా శిస్తులు కడుతూ పంటలు పండిస్తూ నానా నరకయాతన అనుభవిస్తున్న నిరుపేద రైతులకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు?. ఇవన్నీ వదలి ఒక పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తూ, అభద్రతా భావంతో ఇక్కడ నువ్వు ఓడిపోతావ్ అన్న భయంతో, మతిభ్రమించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది నీ ప్రవర్తన. ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అంచలంచెలుగా ఎదుగుతూ 75 వేల ఓటు బ్యాంకును సొంతంచేసుకుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఓడించి, ఇంటికి పరిమితం చేసి, శాశ్వతంగా కుటుంబ వారసత్వాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, సరికొత్త జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, సోమశేఖర్, మండల కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.