తల్లే త్రిమూర్తి ఆధ్వర్యంలో జనసేన కరపత్రాల పంపిణీ

జి. మాడుగుల: జనసేన పార్టీ నాయకులు తల్లే త్రిమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీ ప్రభుత్వంలో గిరిజన సమాజానికి జరిగిన అభివృద్ధి కంటే అనర్దాలే ఎక్కువని రాజ్యాంగ బద్దంగా కల్పించినటువంటి హక్కులు, చట్టాలను వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తూ తూట్లు పొడుస్తున్నా కూడా నోరు మెధపని గిరిజన ప్రజాప్రతినిధులకు నాయకత్వంపై కంటే బానిసత్వంపై మంచి పట్టు ఉందని నిరూపించుకున్నారు. ఇంకోసారి వైసీపీకి అధికారం ఇస్తే గిరిజనుల సహజ సంపద కొల్లగొట్టి తమ బినామీ కంపెనీలకు రాసిచ్చేస్తోందని అన్నారు. ఈ సందర్బంగా నుర్మతి పంచాయితి పలు గ్రామాలను సందర్శించి యువతతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సమీక్షిస్తు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డా. గంగులయ్య ద్వారా విడుదలైన కరపత్రాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. తల్లే త్రిమూర్తి వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు.