ప్రజాజీవనం పట్ల నిర్లక్ష్య ధోరణిలో ప్రజా ఆరోగ్య, పురపాలక ఇంజనీరింగ్ విభాగం మరియు వైసీపీ ప్రజాప్రతినిధులు

  • గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేటు వద్ద పైప్ లైన్ కోసం తీసిన గుంతను తక్షణం పూడ్చాలి
  • పట్టణంలో నిలిచిపోయిన ఈ.ఎల్.ఎస్.ఆర్ ఓఆర్ ఓవర్ హెడ్ ట్యాంక్ పనులును పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీర్చాలి
  • అమృత్ పైప్ లైన్ పనుల నిమిత్తం పలు ఏరియాలో పైప్ లైన్ నిర్మించి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన అనేకచోట్ల ప్యాచ్ వర్క్ లు చేయలేదు, అందువల్ల పట్టణ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది
  • అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్ పట్టణం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోని పలు సమస్యలను అధికారులకు తెలియజేసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ.. ముఖ్యంగా గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేటు వద్దనున్న సోఫియా కాలనీలో పైప్ లైన్ కోసం 20 అడుగుల గుంతను సుమారు 3 నెలల క్రితం తవ్వారు అందులో ఒక 15 అడుగుల సిమెంట్ పైపు వేశారు. మిగిలిన స్థలంలో పెద్ద బండ రాయి ఉందని పనులు ఆపి వెళ్లారు. దీంతో ఆ కాలనీలో రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గుంతలో అనేకసార్లు చిన్నపిల్లలు, వృద్ధులు గుంతలో పడి గాయాల బారిన పడిన సందర్భాలు అనేకం, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత ప్రమాదకరంగా మారింది. ఏది ఏమైనా పెద్ద ప్రమాదం జరగక ముందే పనులు పూర్తి చేయడం లేక ఆ గుంతను పూడ్చడమో చేయాలని కాలనీవాసులు కోరుతున్నారని, అంతేకాకుండా పట్టణంలో ఈ.ఎల్.ఎస్.ఆర్ (సాయినాథ్ గౌడ్ కాలనీ, బాయ్స్ మున్సిపల్ హై స్కూల్) రెండు ట్యాంకుల పనులు నిలబడి పోయాయి. వెంటనే పనులు పూర్తి చేసి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలి, అలాగే అమృత్ పైప్ లైన్ పనుల నిమిత్తం పట్టణంలో అనేక చోట్ల పైప్ లైన్ నిర్మించి దాదాపు 3 సంవత్సరాలు గడిచిన ప్యాచ్ వర్క్ లు చేయలేదు అందువల్ల పట్టణ ప్రజల రాకపోగాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కావున వెంటనే మొద్దు నిద్రలో ఉన్న ప్రజా ఆరోగ్య శాఖ మరియు పురపాలక ఇంజనీరింగ్ విభాగం, వైసీపీ ప్రజా ప్రతినిధులు స్పందించి. సమస్యలను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షాన జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నాయకులు గాజులు రఘు, ఆటో రామకృష్ణ, గంగాధర్ జనసైనికులు కసాపురం వంశీ, అమర్, మంజునాథ్, అనిల్ కుమార్, బర్మాశాల శీన, వీరేష్, శివ, సోఫియా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.