పంచకట్టులో మెరిసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘వకీల్ సాబ్’ గా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వెంటనే క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించాడు పవన్. ఈ సినిమాతో పాటు రానాతో కలిసి నటిస్తున్న సినిమాను కూడా షురూ చేసాడు. పవన్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా పవన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అదిరిపోయే లుక్ లో కనిపించారు పవర్ స్టార్. పంచకట్టులో వైట్ అండ్ వైట్ లో పవన్ లుక్ సూపర్ గా ఉంది. చార్టెడ్ ఫ్లైట్ నుంచి పంచెకట్టుతో పవన్ దిగి నడిచొస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో పవన్‌ని చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.