జ్యోతుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు

పిఠాపురం నియోజకవర్గం: మన్యంవీరుడు, విప్లవ యోధుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా మంగళవారం గొల్లప్రోలు మండలం, వన్నెపూడి- కొడవలి జంక్షన్ జాతీయ రహదారిపై గల స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద జనసేన నాయకులు శ్రీ జ్యోతుల శ్రీనివాసు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 126వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, వన్నెపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు దొడ్డిపట్ల శ్రీను, కొడవలి గ్రామానికి చెందిన నక్కాశ్రీను అనే బద్రి, కొడవలి గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులు, తాటిపర్తి గ్రామానికి చెందిన జనసేన నాయకులు గొల్లపల్లి వీరబాబు, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన నాయకులు దమ్ము చిన్న, దుర్గాడ గ్రామానికి జనసేన నాయకులు చెందిన రావుల తాతారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. అల్లూరిసీతా రామరాజు అతి పిన్నవయసులోనే మన్యం ప్రజలను బ్రిటిష్ వారు అక్రమంగా దోచుకుంటు గిరిజనులను హింసిస్తూన్న వైఖరికి నిరసనగా గిరిజనులకు బాసటగా, గిరిజనులకు సహకారం అందించాలనే దృడసంకల్పంతో విప్లవ బాటలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ఉద్యమాన్ని చేశారు‌. అతి పిన్నవయసులో తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అరాచకాలపై గలమెత్తిన యోధుడని అల్లూరి సీతారామరాజు ను కొనియాడారు. కానీ భారతీయుల దురదృష్టం అతి పిన్న వయసులో బ్రిటిష్ వారి తూటాలకు అల్లూరి సీతారామరాజు గారు నేలకొరిగారు. ఈనాటి యువత అల్లూరి సీతారామరాజు గారి పోరాట ప్రతిమను ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ సక్రమమార్గంలో అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలని యువకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారికి, ప్రజలకు, చుట్టూ ఉన్నా షాపులవారికి, ప్రయాణికులకు స్వీట్లును పంచారు. ఈ కార్యక్రమంలో వన్నెపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు, జనసైనికులు ప్రజలు అడపా మల్లిబాబు, పాలిసెట్టి భూలోకం, దొడ్డిపట్ల శ్రీను, కందా రాంబాబు, దొడ్డిపట్ల గోపాల్, దొడ్డిపట్ల శ్రీను, మొయ్యళ్ళ బాల, గొల్లపల్లి కృష్ణార్జున, దొడ్డిపట్ల గంగాధర్, మొయ్యళ్ళ గంగా నాగేశ్వరరావు, అడపా బాబ్జి, మొయ్యళ్ళ కృష్ణ, దొడ్డిపట్ల వెంకటరమణ, మొయ్యళ్ళ వీరబాబు, గంతకూరి అర్జున్, గొల్లపల్లి రాజబాబు, గంతకూరి దుర్గ, కొడవలి గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులు ముప్పిడి నాగేశ్వరరావు, మచ్చ బాబురావు, తాడిపత్రి శివ, కుక్క పండు అనే ప్రసాద్, తాడిపర్తి నాని, కుక్క వీరబాబు, కాలిపోయిన స్వామి, ముప్పన బోయిన జాను, పొయ్య పాపారావు, ముప్పనబోయిన పండు, కాలిపోయిన శివ, కుక్క లక్ష్మణ్, గణేష్, ఇష్టబోయిన సతీష్, పట్వాల శివ, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కర్రి మహేష్, బుద్ధాల శ్రీనివాస్, గంటా గంగబాబు, పెంకె శ్రీనివాస్, పోలవరపు మోహన్, నరాల శ్రీనివాసరావు, పెంకె మణికంఠ, దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు మేడిబోయిన శ్రీను, కుర్రు శ్రీనివాస్, జ్యోతుల శ్రీనివాస్, శెసెట్టి భద్రం, మంతెన గణేష్, అబ్బిరెడ్డి శివ, కాకి శివరాం తదితరులు పాల్గొన్నారు.