సత్తెనపల్లి నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

సత్తెనపల్లి: స్వర్గీయ వంగవీటి మోహనరంగా 76వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో 11 గ్రామాల్లో వంగవీటి మోహన రంగా చిత్రపటాలకు మరియు విగ్రహాలకు పూలమాలలు వేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి ఘననివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం తాను ఎంతగానో శ్రమించారని వారి యొక్క కష్టనష్టాలు కోసం ముందుండి పోరాటం చేశారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలు ఆలోచనలు ఉనికి పుచ్చుకొని తన అంశతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి మరియు జనసేన పార్టీకి వంగవీటి మోహనరంగా కి నివాళులర్పించే అర్హత ఉందని తెలియజేశారు. మిగతావారు వారు వారి ఓటు రాజకీయాల కోసం రంగా యొక్క విగ్రహ ఆవిష్కరణ అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వంగవీటి మోహన రంగా యొక్క ఆశయ స్ఫూర్తి పేద ప్రజలు అందరూ బాగుండాలని తను ఎలా అయితే పోరాటం చేసి శ్రమించి ఇవాళ ప్రజల హృదయాలను దోచుకున్నాడు అదే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం ఎంతటి వారి కైనా ఎదురు నిలిచి పోరాడే స్ఫూర్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బొర్రా వెంకట అప్పారావు ప్రసంగించడం జరిగినది. అదే విధంగా మన మధ్య లేని వంగవీటి మోహన రంగా కి లక్షల్లో ఖర్చు చేస్తూ విగ్రహాలు ప్రతిష్టించి ఆయనకు అంత గౌరవిస్తున్న మనం బ్రతికున్న మనకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం ఇంతకు పదింతలుగా కష్టపడి ఓట్లు వేసి తనని ముఖ్యమంత్రి చేసిన రోజు నా వంగవీటి మోహన రంగా కి మనం ఇచ్చే నిజమైన గౌరవం అని ప్రజలకు పిలుపునిచ్చారు.