జనసైనికుడు లక్ష్మి నారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన పాఠంశెట్టి

జగ్గంపేట నియోజకవర్గం: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన జగ్గంపేట గ్రామంలో స్ధానిక పల్లపువీధికి చెందిన జనసైనికుడు మాతా లక్ష్మీనారాయణ భౌతికకాయాన్ని శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబసభ్యులకి ధైర్యంచెప్పి, ఓదార్ఛి లక్షీనారాయణ భౌతికఖాయానికి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మాత లక్ష్మీనారాయణ ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాత లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడలో ఒక ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అవడం జరిగిందని, తర్వాత డాక్టర్లు ఇతనిని పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయ్యిందని తెలియజేయడం జరిగింది అని, అలాగే వైద్యులు మాతా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను అవయవ దానానికి ఒప్పించడం జరిగిందని, ఈ మాతా లక్ష్మీనారాయణ అవయవాలను నలుగురికి అమర్చడం జరిగిందని, ఎప్పటికీ జనసైనికుడు మాతా లక్ష్మీనారాయణ ఈ నలుగురిలో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా మన జనసైనికుడు మాతా లక్ష్మీనారాయణ జనసేన పార్టీ సభ్యత్వం చేయించుకోవడం జరిగిందని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికులు ఎవరైనా ప్రమాదపుశాత్తు చనిపోతే ప్రమాద భీమ కింద ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని. సభ్యత్వం చేయించుకున్న ప్రతి జనసైనికుల కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. కావున మాతా లక్ష్మీనారాయణ కుటుంబానికి జనసేన పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. పాఠంశెట్టి సూర్యచంద్ర వెంట జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జగ్గంపేట టౌను అధ్యక్షుడు గవరసుధాకర్, జగ్గంపేట మండల ఐటి కో ఆర్డినేటర్ సూరపురెడ్డి నరేష్, పవిడిశెట్టి సాయిచంద్ర, బుదిరెడ్డి వంశీ, శివ తదితరులు ఉన్నారు.