నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

  • ఖమ్మం జనసేన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

ఖమ్మం: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ తరుపున ధర్నా చౌక్ లో రిలే నిరాహారదీక్ష చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ వలన మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని, ఫీజుల నియంత్రణ కోసం ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను అధిక రేటుకు అమ్ముతూ సొమ్ములు చేసుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై జిల్లా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సరైన అనుమతుల లేని విద్యా సంస్థలను, సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను విద్యాశాఖాధికారిని రామకృష్ణ మిరియాల డిమాండ్ చేసారు. లేని పక్షంలో కలెక్టరేట్ ను ముట్టడి చేస్తామని ప్రకటించారు. ఈ యొక్క రిలే నిరాహారదీక్షకు ఖమ్మం నగరంలో గల పలు పార్టీల నేతలు, విద్యార్థి సంఘం నేతలు మద్దతు తెలపడం జరిగింది. జనసేన పార్టీ సత్తుపల్లి ఇంచార్జి బండి నరేష్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ, ఉపాధ్యక్షులు దేవేందర్, రఘునాధపాలెం మండల నాయకులు సచ్చు స్రవంత్ కన్నా, నగర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తుడుం ఉత్తమ్ రాజు, బాణాల శ్రీకాంత్ సెక్రెటరీ లు లింగాల పుల్లారావు, గుండ్ల పవన్ కల్యాణ్, కార్యవర్గ సభ్యులు రమణ కుమార్, ఉపేందర్, విజకుమారి, దుర్గాప్రసాద్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొండ పవన్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాకేష్, ఉపాధ్యక్షులు ఉదయ్, విజయ్ సోషల్ మీడియా కో ఆర్డినెటర్లు దిలీప్, వివేక్, మనోజ్ ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల నాయకులు డేవిడ్, శివరామకృష్ణ, రాంబాబు, ప్రవీణ్, శరత్, జబీర్, దినేష్ మరియు ఖమ్మం నియోజకవర్గలోని డివిజన్ కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.