సమస్యలపై మాట్లాడలేని సన్నాసులే సంసారాలు జోలికి వస్తారు

  • చేతకాని వాడు, వ్యక్తిత్వం లేని వాడు వ్యక్తిగత విమర్శలు చేస్తాడు

నెల్లూరు:  సమస్యలపై మాట్లాడలేని సన్నాసులే సంసారాలు జోలికి వస్తారు.. వైసీపీ అంతం ఇదే జనసేన పంతం ఇదే మా నినాదం.. అన్న శ్రీ శ్రీ వ్యాఖ్యలను ఈ వేసిపి ప్రభుత్వం నిదర్శనంగా అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వీరమహిళా రీజనల్ కో ఆర్డినేటర్ కన్వీనర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నగర డిఎస్పిని కలిసి సోషల్ సామాజిక మాధ్యమాలలో పవన్ కళ్యాణ్ గారి గురించి వారి కుటుంబం గురించి దుర్భాషలాడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మనవి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు.. చేతకానివాడు వ్యక్తిత్వం లేనివాడు వ్యక్తిగత సమస్య విమర్శలు చేస్తాడు. సమస్యలపై మాట్లాడలేని సన్నాసులే సంసారాల జోలికి వస్తారు అని నేడు వైసిపి ఫాలోయర్స్ కొంతమంది. మేము సంసారాలు, వ్యక్తిగత జీవితాలు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడలేము అన్న చందాన వారి ప్రవర్తన సాగుతుంది. మొన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతారు సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న తప్పడు పోస్టుల యుద్ధానికి తెరపడల్సిన అవసరం ఉందన్నారు, ఇంకా మహిళలపై బయటకు వచ్చి మాట్లాడడానికి ఎంత భయపడతారో అదే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె ఉద్దేశం తెలిపారు. ఈ రోజు జనసేన తరుపున ప్రశ్నిస్తున్నాను.. మీరు తెలిపింది ఒక పార్టీకా, ఒక కులానికి లేకపోతే అందరి ప్రజలను ఉద్దేశించి అన్నారా అని క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. గౌరవ హోదాలో ఉన్న వాసిరెడ్డి పద్మ గారు వారి మాట నిలబెట్టుకోవాలి, గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు గూర్చి సామాజిక మాధ్యమాలలో దూషణలు కనపడలేదా..?. పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చిన ఖండించినప్పటి నుంచి మరింత ఉధృతంగా లెక్కలేని తనం ప్రవర్తిస్తున్నారు.సామాజిక మాధ్యమాలలో అసభ్య ప్రచారానికి అంతే లేకుండా ఉంది మహిళల విలువ తెలిస్తే ఎవడు ఆ విధంగా మాట్లాడడు. కుటుంబానికి దూరంగా ఉన్న సన్నాసి వెధవలు ఈ విధంగా మాట్లాడుతారు. కోట్లాదిమంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సభ్యుల అసభ్య పదజాలంతో దూషిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ మాట్లాడే వెధవలు అందరూ దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలి సామాజిక మాధ్యమాలలో కాదు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి సమస్యపై మాట్లాడగానే ఈ విష ప్రచారం స్టార్ట్ చేస్తారు ఇలా మాట్లాడే వారికి మాట్లాడించేవారికి మాట్లాడేందుకు డబ్బులు ఇస్తున్న వారికి రానున్న రోజుల్లో సరైన సమాధానం చెప్తాము. నగర డి.ఎస్.పి గారిని కలిసి వీరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ప్రతిరోజు వ్యక్తిగత దూషణ కుటుంబ దూషణ జరుగుతున్నా స్థిత ప్రజ్ఞతతో సమాజ శ్రేయస్సు కోసం సహనం వహిస్తూ ఎంతో పరిణితి తో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉన్నత గుణానికి పట్టం కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి.
సమాజ శ్రేయస్సుకోసం నిరంతరం తపించే మెగా ఫ్యామిలీ గురించి వారి కుటుంబం గురించి దూషణ చేస్తున్న వారిపై కక్ష సాధించుకోవాల్సిన అవసరం జనసేన పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులకు ఉంది. ఈ పోస్టులు ఎందుకు పెట్టాం ఈ విధంగా ఎందుకు మాట్లాడమని పశ్చాతాపం చెంది రోజు దగ్గరలోనే ఉన్నాయి. దానికి వందింతలు కష్టపడాల్సిందిగా జన సైనికులకు పిలుపు నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించక పోయినా అదే ఆ ప్రాంతపు అలవాటుగా మారి వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలందరూ వీరి ప్రవర్తనను గమనించి వీరికి తగిన బుద్ధి చెప్పి ప్రజా ప్రభుత్వానికి జనసేన అవకాశం కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, వీరమహిళలు లక్ష్మి, రేణుక, నిర్మల, కస్తూరి, కృష్ణవేణి, ప్రవల్లిక, హైమావతి, జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, నగర కార్యదర్శి హేమచంద్ర యాదవ్, నాయకులు ఖలీల్, ప్రసన్న, వర కుమార్, మౌనిష్, బాలాజీ, బాను, వర్షన్, షారు తదితర జనసేన నాయకులు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.