వాలంటీర్ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు..?

  • మృతుడు కుటుంబానికి వైసిపి నాయకులే బాధ్యత వహించాలి
  • జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ డిమాండ్

కొండెపి: సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామంలో, మాలపల్లికి చెందిన మేడిద బాలకోటయ్య వృత్తి నిత్య ఐస్ వ్యాపారం చేసుకునే క్రమంలో కరేడు పెద్ద పల్లె పాలెంలో రోయ్యల చెరువు దగ్గర ప్రమాదవశాస్తు త్రీఫేస్ కరెంటు షాక్ తగిలి మరణించడం జరిగినది. అర్హత కలిగిన మృతుడు బాలకోటయ్యకు ఆగ్రామ వాలంటీర్ హరి వైయస్సార్ భీమా చేయనందు వలన లబ్ధిదారులకు అందవలసిన ఐదు లక్షల బీమా వర్తించదని ప్రభుత్వం చెప్పడం జరిగినది. దీనిపై గ్రామ వాలంటీర్ నీ వివరణ అడుగగా పొంతనలేని సమాధానం చెప్పడం జరిగినది. జనసేన పార్టీ నుండి మృతుడు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, వాలంటీర్ అసమర్ధత, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ బీమా అందకుండా మృతుడు బాలకోట కుటుంబానికి తీరని అన్యాయం జరిగినది. మరి ఈ కుటుంబానికి బాధ్యత వాలంటీర్ నా?, లేక ఎంపీడీవో జమీబుల్లా?, లేక వైఎస్ఆర్సిపి నాయకులా?, లేక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా..?. దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ మృతుని కుటుంబానికి అండగా ఉంటుందని, అంతే కాకుండా వారి కుటుంబానికి వైఎస్ఆర్ భీమా పధకం గానీ లేక, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కానీ ఇచ్చి దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతునీ కుటుంబం మరియు ఆ కాలనీవాసులతో ఎంపిడిఓ కార్యాలయంను ముట్టడి చేయడం జరుగుతుంది. మృతునీ బాలకోటాయకు భార్య, ముగ్గురు పిల్లలు కలరు. దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ ఆ కాలనీ వాసులతో ఎంత దూరం అయిన పోరాటం చేయడినికి ఏ మాత్రం వెనుకాడబోదు అని జనసేన పార్టీ తరఫున రాజేష్ తెలియజేసారు.