చినకాకాని గ్రామంలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలి: చిల్లపల్లి

మంగళగిరి నియోజకవర్గం: చిన్నకాకాని గ్రామంలో మురుగు కాలువ పూడిపోయి తుటకు మట్టి అడ్డుపడి మురుగునీరు పారక మురుగునీరు మొత్తం గుంటూరు ఛానల్ మంచినీళ్ల కాలువలో కలవడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చినకాకాని గ్రామంలోని పూడిపోయిన కాలువను పరిశీలించడం జరిగింది. అధికారులు దీనిని పరిశీలించి తగు చర్యలు అతి త్వరగా తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ చిన్నకాకాని గ్రామ కమిటీ తరఫు నుంచి కోరుచున్నామని శ్రీనివాసరావు తెలిపారు.