డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన నిరసన ర్యాలీ

పాడేరు: జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు శుక్రవారం జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ కార్యకర్తల ముసుగులో ఉన్న వాలంటీర్ల దుశ్చర్యకు నిరసన ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో నుంచి వైసీపీ ప్రభుత్వ వైఫల్యం, గిరిజన సమస్యలపై కరపత్రాలను ప్రజలకు అందిస్తూ హలో పాడేరు.. బై బై వైసీపీ, మా డేటా మా హక్కు.. జగన్ పోవాలి.. పవన్ రావాలి అంటూ నినదిస్తూ ర్యాలీగా జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలి కి జనసైనికులు, వీరమహిళలు, నాయకులు చేరుకుని శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. అనంతరం జనసేన పార్టీ వీరమహిళలు కిటలంగి పద్మ మాట్లాడుతూ.. పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక రాజకీయ పార్టీ చేతుల్లో ఉండడం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు సబబు అన్నారు. మీరు సేకరించిన డేటా భద్రంగా ఉందని హామీ ఇవ్వగలరా?.. పవన్ కళ్యాణ్ పౌరులు వ్యక్తిగత డేటా భద్రత విషయమై మాట్లాడారని దానిని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారని అన్నారు. అలాగే పాడేరు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ గంగులయ్య మాట్లాడుతూ ఎన్.సీ.బీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాట్లాడారని దానికి అధికార ప్రభుత్వం చిలువలు పలువలు చేసి వక్రీకరించి ఇప్పుడు వైసీపీ ముసుగులో ఉన్న వాలంటీర్లు చేస్తున్న అసత్య ప్రచారాలు కేవలం నమ్మి వాలంటీర్లు చేసే వ్యాఖ్యలను నమ్మినంతకాలం అసలు వాస్తవాలు గిరిజన ప్రజలకు తెలియవని, అలాగే వాలంటీర్ల సోదరులకు వస్తున్న జీత భత్యాలు, వారి అర్హతకు ప్రతిభకు కొలమానంగా లేవని, గిరిజన ఆస్తిత్వంపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే మీరు ఏ నిరసనలు చేసారని, జాతి ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనం ముఖ్యమా అంటూ ప్రశ్నిస్తున్నామని అన్నారు. దయచేసి వాలంటీర్ సోదరులలో జనసేనాని అభిమానులున్నారని వారందరు ప్రస్తుతం ఆలోచనలో పడ్డారని, కేవలం వైసీపీ ప్రభుత్వం అభిమానులు పేటియం బ్యాచ్ లు మాత్రమే రకరకాల వదంతులు, వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ గిరిజన సమైక్యతకు, గిరిజన సహజ సంపదకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. దయచేసి గిరిజన ప్రజలు ఒక వాస్తవ విషయం అయిన వ్యక్తిగత సమాచారం గోప్యత అసలైన అంశమని దాని భద్రత అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఈ ర్యాలీలో పాడేరు మండల నాయకులు వీరమహిళ దివ్యలత బొంకుల, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, కొర్ర కమల్ హాసన్, మజ్జి, సత్యనారాయణ, పాడేరు పట్టణ అధ్యక్షులు, సురేష్, కార్యనిర్వహన అధ్యక్షులు, మజ్జి నగేష్, అశోక్, జి.మాడుగుల అధ్యక్షులు మసాడి భీమన్న, తాంగుల రమేష్, కార్యనిర్వహణ అధ్యక్షులు, చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్, సాయి, తదితర నాయకులు పాల్గొన్నారు.