ఇది దండయాత్ర కాదు, ధర్మ పోరాట యాత్ర

  • శాంపుల్ రాకకే దండయాత్ర అంటే ఎలా – అది దండయాత్ర కాదు, ధర్మ పోరాట యాత్ర ఎమ్మెల్యే గారు..
  • త్వరలో అసలైన జనసేనాని వారాహి దండ యాత్ర రానుంది కాస్కోండి
  • జనసేన పార్టీ హెచ్చరిక

తిరుపతి: దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, కబ్జాలతో వైసీపీ పాలన కొనసాగుతున్నదని, ఈ తరుణంలో శ్రీ కాళహస్తిలో సిఐ అంజు యాదవ్ జనసేన కార్యకర్త కొట్టేసాయి పై దాడి చేయడం వైకాపా దారుణాలకు అంతు లేదా అంటూ.. తమ జనసేనాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తిరుపతి జిల్లా ఎస్పీ కి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వినతిపత్రం సోమవారం స్పందన కార్యక్రమంలో సమర్పించడం తప్పా? అంటూ.. దీనిని దండయాత్రగా స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి హితవు పలికారు. మంగళవారం స్థానిక తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా ముందు జనసేన నాయకులు బాబ్జి, రాజేష్ ఆచారి, మునస్వామి, రుద్ర కిషోర్, సాయిదేవ్, పవన్ కుమార్ సుజిత్ తదితరులతో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆగష్టులో చిత్తూరు జిల్లాకు వారాహి రానున్నదని అదే అసలైన జనసేనాని దండయాత్ర అంటూ అభివర్ణించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రం లో ప్రజలను దోపిడీ చేస్తున్న వైయస్సార్సీపి నాయకుల భరతం పట్టడానికి పవన్ కళ్యాణ్ రానున్నారని హెచ్చరించారు. అదే అసలు సిసలైన దండయాత్ర అంటూ నిప్పులు చెరిగారు.