దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని రంగపేట గ్రామం

  • జనసేన జగిత్యాల నియోజక వర్గ ఇంఛార్జి బెక్కం జనార్ధన్

జగిత్యాల నియోజకవర్గం: స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని దశాబ్ద కాలం గడుస్తున్నా నా పల్లె గ్రామాలకు కనీసం కంకర రోడ్డుకు కూడా గతి లేదు నా పల్లెకు.. జగిత్యాల నియోజవర్గం, సారంగాపూర్ మండలం, గ్రామం రంగపేటలో ఇప్పటి వరకు గత 20 సంవత్సరాలుగా 3 పార్టీల ఎమ్మెల్యేలు హామీలకు మాత్రమే కానీ ఆచరణకు నోచుకోలేదు నా పల్లె. చిన్న పాటి వర్షానికే నా పల్లె రోడ్డు పరిస్థితి ఇది. మళ్ళీ ఎన్నికల సమయంలో తప్ప పల్లెకు రావటం లేదు నాయకులు.. కనీస సౌకర్యాలు లేని నా పల్లెకు మోక్షం కలిగించి రోడ్డు వెయ్యగలరు అని జనసేన జగిత్యాల నియోజక వర్గ ఇంఛార్జి బెక్కం జనార్ధన్ విజ్ఞాపన చేసారు. జనార్ధన్ తన ఊరి స్థితిగతులను జిల్లాకు పరిచయం చెయ్యడానికి మంఘళవారం పత్రికా ముఖంగా తను పుట్టిన ఊరి స్థితిగతులు తెలియ చెయ్యడం జరిగింది. ముడితే కూలిపోయే ఇంట్లో బ్రతుకుతున్న నా ఊరి పల్లె వాసులు 27. ఇన్ని కుటుంబాలకు ఒక్కసారిగా కాకుండా ఊరి బాగోగులు ప్రభుత్వ పాలకులు అధికారులు గ్రహించి ఆధునీకరించ బడిన నగరాలకు చేరువ చెయ్యడానికి రోడ్డు వేసి ఆసుపత్రుల, రిజిస్ట్రేషన్ల, ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్ళడానికి రోజువారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బెక్కం జనార్ధన్ డిమాండ్ చేశారు.