అనంత సాగరంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

ఆత్మకూరు నియోజకవర్గం: అనంత సాగరం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆత్మకురూ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని తప్పు పట్టలేదని, వ్యవస్థలో కొంతమంది చేసే పనులను మాత్రమే చెప్పారని అన్నారు. అలాగే వాలంటీర్లుగా డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం అయిదు వేల రూపాయలు అంటే రోజుకు 166 రూపాయలుతో 10 గంటలు చాకిరీ చేయించడం దారుణమని, వారికి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్ప కొంతమంది వైసీపీ నాయకులు కావాలని వాలంటీర్లను కించపరచారు అని దుమారం రేపడం సరికాదన్నారు. వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర పన్నినట్టు తెలుస్తుంది అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ కరిముల, మంగు దొడ్డి హరి కృష్ణ నాగభూషణం, వెంకట్ రమణ, పెనగలురు చిన్నయ్య, గల్ల నాగ రాజు, అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.