పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా జగనన్న ఇళ్ళు

  • జనసేన యువ నాయకుడు హుస్సేన్ ఖాన్

విజయనగరం: రాష్ట్రంలోని అతి పెద్ద లేఔట్ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే గుంకలం లేఔట్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందని ఆరోపించారు. గుంకలం లే అవుట్ లో పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు కనీస సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని, ముఖ్యంగా ఇల్లు నిర్మించుకునేందుకు నీటి సదుపాయం లేక బ్లాక్ లో 600 చొప్పున వాటర్ ట్యాంకులు కొనుక్కొని పనులు చేసుకుంటున్నారని వెంటనే ఈ దోపిడీని ఆపి బోర్లు, మోటర్లు, హ్యాండ్ పంపులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్, నాయకులు యర్నాగుల చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు, మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు మంగళవారం ఉదయం వినతి పత్రాన్ని అందించారు. అధికారులు సానుకూలంగా స్పందించారని, లేదంటే పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రజా సంఘాలతో ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసైనికులు భవాని, రమణ, పండు పాల్గొన్నారు.