పార్టీలకు, ప్రభుత్వ అధికారులకు కులం రంగు పులమొద్దు

  • యాదవ కులానికి చెడ్డపేరు తేవద్దు
  • సుభాష్ ను హెచ్చరించిన జనసేన నేత – రాజేష్ యాదవ్..

తిరుపతి: శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ తమ జనసేన కార్యకర్త కొట్టేసాయిని చేయి చేసుకోవడాన్ని తెలుసుకున్న తమ జనసేనాని మరోసారి జనసైనికుడిపై ఈ గుండా వైకాపా పాలనలో తిరిగి పునరావృతం కాకూడదన్న మంచి ఉద్దేశంతో, చట్టాన్ని గౌరవించి తిరుపతి జిల్లా ఎస్పీకి సోమవారం వినతిపత్రం సమర్పిస్తే ‘ఇలాంటి ధర్మమైన నిర్ణయాన్ని అనుసరిస్తే, దీనిని తప్పు పట్టిన (సుభాష్ యాదవ్) యాదవ కులాన్ని ఉద్ధరించే అపర శ్రీ కృష్ణడిలా తమ జనసేనానిపై దుర్భాషలాడిన తీరును తప్పుపడుతూ.. గతంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి బిసి నాయకుడు రామచంద్ర యాదవ్ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడితే నీకు కళ్ళు కనిపించలేదా, ఒళ్ళు మైకం కమ్మిందా, లేక అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ మొద్దు నిద్ర నిద్ర పోతున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాను తిరుపతిలోనే ఉంటానని, సుభాష్ ఎక్కడికి చెబితే అక్కడికి వచ్చి, గుడ్డలూడతీసి గాడిదపై ఊరేగిస్తానని, లైవ్ లో తన ఫోన్ నెంబర్ ఇచ్చి తనకు ఫోన్ చేస్తే తాను చెప్పిన స్పాట్ కు వస్తానని సుభాష్ కు, రాజేష్ యాదవ్ మంగళవారం తిరుపతిలో మీడియా ముఖంగా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత నాయకులు సాయిదేవ్ యాదవ్, బాబ్జి, హరినాయక్, పవన్, మునుస్వామి, రాజేష్ నాయక్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.