ఆత్మకూరులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

ఆత్మకూరు నియోజకవర్గం: ఆత్మకూరు జనసేన ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గుమ్మడికాయను దిష్టి తీయడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆత్మకూరు, అనంతసాగరం మండల కేంద్రాల్లో వాలంటీర్లు నినాదాలు చేయడం మనకందరికీ తెలిసిందే. 2004లో ఖర్చులకోసం హైదరాబాదులో ఇంటిని అమ్మిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, 2009 కల్లా వందల కోట్ల రూపాయల అడ్వాన్స్ టాక్స్ కట్టే పరిస్థితికి చేరింది అంటే ఎంతగా అవినీతికి పాల్పడ్డారో, ఎంత ప్రజా ధనాన్ని దోచేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం వచ్చిన సానుభూతిని ఉపయోగించుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన విషయం ప్రజలందరికీ తెలిసినదే. కానీ వీరి పాలనా కాలంలో అడ్డగోలుగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి గారి వంటి ఎందరో ఐఏఎస్ అధికారులు, అధికారిణులు జైలు ఊచలు లెక్కపెట్టిన విషయం మనకు అందరికీ తెలిసినదే. ఆ ఐఏఎస్ అధికారుల బాటలోనే నేటి వాలంటీర్లు కళ్ళు మూసుకుని, వైసిపి నాయకులు చెప్పిన విధంగా ప్రవర్తిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి ముప్పు కలుగుతుంది అన్న ఉద్దేశంతో, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల క్షేమం కోరి వారిని హెచ్చరించడం జరిగింది. రాజ్యాంగ ప్రకారం సంక్రమించిన హక్కులను కాలరాస్తూ చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల నుండి వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరిస్తున్నారు. ఈ వ్యక్తిగత సమాచారం వైసీపీలోని కొంతమంది పెద్దల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులకు చేరుతుందని, ఆ కారణంగా గత మూడున్నర సంవత్సరాల వైసిపి పాలనాకాలంలో సుమారు 32వేల పైచిలుకు యువతులు అదృశ్యమయ్యారని కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు రాబోయే ప్రమాదాన్ని గుర్తించి వాలంటీర్ల క్షేమం దృష్ట్యా వారిని హెచ్చరించడం జరిగింది. కానీ వాలంటీర్లు వైసిపి నాయకుల ఉచ్చులో చిక్కుకొని, వాస్తవాన్ని గ్రహించినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో రోడ్లమీదకు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినదే. ఇప్పటికైనా వాలంటీర్లు వైసీపీ నాయకుల దృతరాష్ట్ర కౌగిలి వలన రాబోయే ముప్పును అనర్థాలను గుర్తించి జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.