మేం సిద్ధం.. మీరు సిద్ధమేనా?

  • జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు నియోజకవర్గం: అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమేనా అని వైసీపీ నేతలను జనసేన రాష్ట్ర కార్యదర్శి శాతంశెట్టి నాగేంద్ర ప్రశ్నించారు. శనివారం అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచంగా దిగజారి తమ నేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారని, తిరిగి జగన్ కుటుంబంలోని తాత, ముత్తాతలకు ఎన్ని పెళ్లిలో వివరాలు తీస్తే అసలు బండారం బయటపడుతుందని చెప్పారు. తమ జోలికొస్తే తాను ఇంతేనని హెచ్చరించారు. రాష్ట్రంలో 2,68,000 మంది వాలంటీర్లు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని, వారందరి ఉద్యోగాల ఉనికిని పవన్ ప్రశ్నిస్తున్నారని విమర్శించడం అర్థరహితమన్నారు. వాలంటీర్లు మాదిరిగానే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారా అని నాగేంద్ర సవాల్ విసిరారు. పెళ్లిళ్ల విషయంలో ఎవరి వ్యక్తిగత జీవితం వారిదని చెప్పారు. ఇక రైల్వే కోడూరు నియోజకవర్గంలో నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు వివరించాలన్నారు. మరో నాలుగు సార్లు గెలిపించినా అభివృద్ధి ఏమి చేయలేరని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ముందు పవన్ కళ్యాణ్ ని గెలిచి చూడమని చెప్తున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఈసారి టికెట్ వస్తుందో లేదో చూసుకోవాలని చెప్పారు. మాట మాటకు హాస్టల్లో చదువుకున్న వాడినని చెబుతున్న ఎమ్మెల్యే కొరముట్ల హాస్టళ్ళ భాగు కోసం ఏం చేశారో చెప్పాలని విమర్శించారు. రాష్ట్రంలో 98.5% సమస్యలను పరిష్కరించామని చెబుతున్న మిగిలిన ఒకటి పాయింట్ ఐదు శాతంలో రైల్వే కోడూరు రోడ్డు చిట్వేలి కాలేజీ లాంటిది ఏమైనా ఉన్నాయా అని విమర్శించారు. కార్యక్రమంలో చిట్వేలు మండల నాయకులు మాదాసు నరసింహ, రియాజ్ మదాసు శివ పగడాల శివ తుపాకుల పెంచలయ్య, వరికుంట నాగరాజు, దాసరి వీరేంద్ర, సింగనమల శివ, తదితరులు పాల్గొన్నారు.