జోకర్ రమేష్ నీ నోరు అదుపులో పెట్టుకో: రాయపూడి

అవనిగడ్డ నియోజకవర్గం: సోమవారం వెంకటయి పాలెంలో జరిగిన ఒక నిండుసభలో ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ జనసేన పార్టీ తరుపున ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పిచ్చి కుక్క పోరంబోకు అయిన జోకర్ రమేష్, పిచ్చి కుక్కలా మొరిగిన జోగి రమేష్. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్దం కావటం లేదు!. త్రాగుబోతు రమేష్ పిచ్చి కుక్కలా మాట్లాడుతుంటే.. యధా రాజా తథా ప్రజా అన్నట్టు సీఎం జగన్ మూసి మూసి నవ్వులు నవ్వుతున్నాడు. రాష్ట్ర మంత్రిగా ఎదో ఉద్దరిస్తావ్ అని నిన్ను ప్రజలు ఎన్నుకుంటే చేసింది ఏమీ లేదు. మడ అడవులు అమ్ముకుంటున్నావు, కృత్తివెన్ను మండలంలో మడ అడవులు మాయం – లక్ష రూపాయల లంచం ఇస్తే కరెంట్ వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నావు. ఇసుక మాఫియా కొంత మంది మండల అధ్యక్షుల చేతులలో పెట్టి నడిపిస్తున్నావు. పెడన నియోజకవర్గంలో 90% రైతుల గురించి ఏరోజు ఏమి చేసింది లేదు. పక్కనోడి పెళ్ళాల గురించి నీకు ఎందుకు? నీ పెళ్ళం గురించి చూసుకో.. నీ అవినీతి చిట్టా మొత్తం మా అధ్యక్షుల దగ్గర ఉంది. ఆయన వచ్చి నీ అవినీతి చిట్టా బయట పెడతారు. ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం. పిచ్చి కుక్క జోగి రమేష్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోలు తీస్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఏ పదవిలో లేక పోయినా ఎన్నో కోట్ల మందికి సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. అది చేతకాక ఈ పిచ్చి ప్రేలాపనలు నీ కొడుకు సీట్ కోసం ముఖ్యమంత్రి బజన చేసుకో.. అంతే కానీ పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చెవాకులు మాట్లాడవద్దు. ప్రజా సేవ కోసం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాడడానికి సిద్దంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సైగ చేస్తే కనిపించకుండా పోతావు. నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. ఈ 6 నెలలు అయినా ఏదైనా చేసి చూపించు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము అనీ జనసేన పార్టీ తరుపున రాయపూడి హెచ్చరించారు.