జోగి నోరు అదుపులో పెట్టుకో!.. అంకె ఈశ్వరయ్య

  • పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తరిమి కొడతారు

కళ్యాణదుర్గం: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి మెప్పు కోసం వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జోగి రమేష్ ఒక గజ్జి కుక్క మాదిరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పట్ల మంత్రిపై జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ మీటింగ్ లో ప్రభుత్వం చేసినటువంటి ఈ పాలసీలను చెప్పలేక వారాహి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వ పునాదులు కదులుతాయి అన్న ఉద్దేశంతో జోగి రమేష్ గజ్జి కుక్క మాదిరి మాట్లాడుతున్నారని అన్నారు.
జోగి రమేష్ మీ అధినేత జగన్ రెడ్డి పాలనలో ఎవరికి న్యాయం చేశాడో చెప్పగలవా..? జగన్ తన కన్నతల్లి కి న్యాయం చేసాడా..? తన తోడ బుట్టిన చెల్లి కి న్యాయం చేశాడా..? వివేకా హత్య కేసులో న్యాయం కోసం రోడ్డున తిరుగుతున్న చెల్లి కి న్యాయం చేశాడా..? సొంత కుటుంబానికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా..? దమ్ముంటే ప్రజా పాలసీలు మీద బహిరంగ చర్చకు రాగలరా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే జోగి రమేష్ నిన్ను గజ్జి కుక్క మాదిరి తరిమి కొడతామని మంత్రిని ఈశ్వరయ్య హెచ్చరించారు.