జనసేన చేతిలో నారాయణస్వామి ఓటమి తథ్యం: డా. యుగంధర్

  • జెఎస్పి షణ్ముఖ వ్యూహంలో వైసిపి కొట్టుకు పోవడం ఖాయం
  • గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి డా. యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: గంగాధర నెల్లూరు మండలంలో గడపగడప కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రతిస్పందనగా కార్వేటినగరం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనసేన ఇన్చార్జి యుగంధర్ మాట్లాడుతూ జనసేన షణ్ముఖ వ్యూహంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని, జనసేన చేతిలో నారాయణస్వామి చిత్తుచిత్తుగా ఓడటం తద్యమని తెలిపారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అజెండా అని, ఒక అద్భుతమైన మేనిఫెస్టో కలిగిన పార్టీ జనసేన అని కొనియాడారు. జనసేన మంచి మేనిఫెస్టో కలిగి ఉంది అనటానికి చక్కటి ఉదాహరణ యువతను పారిశ్రామికవేత్తలుగా చేయడమేనని ఉద్ఘాటించారు. ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించని డబ్బులు ఇచ్చి వారి ద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. అర్థంపర్థం లేని మాటలు మాట్లాడే ఉప ముఖ్యమంత్రి నోరు మూసుకుని ఉండటం మంచిదని, ఒకవేళ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిదని, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అని మాట్లాడితే నీ వ్యక్తిగతం, నీ కుటుంబం వ్యక్తిగతం గురించి మాట్లాడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి దశాబ్దాల కాలం పాటు బాగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని ఒక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ద్వారా జనసేన ఆవిర్భవించిందని, మీలాగా అరువు తెచ్చుకొన్న పార్టీలో ఉంటూ, హద్దు అదుపు లేకుండా మతిస్థిమితం కోల్పోయి అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ నీ వాళ్ళ ద్వారా అవహేళన చెందుతూ, అవమానింపబడుతూ ఓటమికి సిద్ధంగా ఉన్నావని ఎద్దేవా చేశారు. నాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, వాసిరెడ్డి పద్మ, వాగే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రప్రసాద్, పార్థసారథి మొదలగు వారందరూ వ్యక్తిగత గోప్యత విషయమై మాట్లాడుతూ డేటాలో ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంకు పాస్ బుక్, ఇన్కమ్ టాక్స్ వివరాలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళకూడదని ఓహో అని ఊదరగొడుతూ నేడు యువతను తప్పుదోవ పెట్టిస్తూ వారి ద్వారా మీరు పంపిస్తున్న డేటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది మా అధ్యక్షుల వారి మనోవేదన అని చెప్పారు. అవసరమైతే వాలంటీర్లకు ఇంకో ఐదు వేలు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం గానీ వారి కడుపు కొట్టే ప్రసక్తే లేదని మా అధ్యక్షులు తెలిపారు. స్వామి నువ్వు ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలని వచ్చిన వాడవైతే చివరగా కార్వేటి నగరం నుండి వయా దేవళంపేట మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు రోడ్డును విస్తరించి ప్రమాదాల బారి నుండి నియోజకవర్గ ప్రజలను రక్షించుమని, పెనుమూరు నుండి చిత్తూరుకు వెళ్లే రహదారిలో శాతంభాకం వద్ద పడిన గుంతను సరి చేయమని, వెంగల్ రాజు కుప్పం వద్ద ఉన్న బ్రిడ్జిని రిపేరు చేయమని, వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల నిర్మించమని, గంగాధర్ నెల్లూరు మండలంలో ఉన్న 32 గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రజలు చిరస్మరణీయంగా నిన్ను గుర్తుపెట్టుకునేటట్లు దానికి ఒక ప్రాధాన్యత తీసుకొని రమ్మని ఛాలెంజ్ విసిరారు. చివరగా ఈ నియోజకవర్గ దేనికి ప్రసిద్ధి అని సూటిగా ఆయనను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రధాన కార్యదర్శి నరేష్, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, టౌన్ ఉపాధ్యక్షులు మణి పాల్గొన్నారు.