బ్రో సినిమా సక్సెస్ తో కొవ్వూరు టౌన్ లో జనసేన సంబరాలు

కొవ్వూరు నియోజకవర్గం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా విడుదలై, విజయవంతం అయినందున శుక్రవారం కొవ్వూరు టౌన్ లోని రెండు థియేటర్ల దగ్గర కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే టీవీ రామారావు కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల ప్రెసిడెంట్ సుంకర సత్తిబాబు, చాగల్లు మండల ప్రెసిడెంట్ ఉప్పులూరి చిరంజీవి, టౌన్ అధ్యక్షులు డేగల రాము, నియోజకవర్గ నాయకులు చౌటుపల్లి శివ, యువజన అధ్యక్షుడు గండ్రోతు పవన్, నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.