రణస్థలంలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం, రావాడ పంచాయతీ రావాడ హరిజనుల కాలనీలో శనివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శనివారం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలను చూస్తుంటే చాలా దారుణంగా, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. చెరువులను తలదన్నేలా ఉన్న ఈ కాలనీలో పేదల పక్కా గృహాలు ఎలా నిర్మించుకుంటారని, దేనికి ఉపయోగంలేని, కనీసం పందులు కూడా ఉండలేనటువంటి ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఇవ్వడమనేది చాలా దారుణం. జగన్ రెడ్డి విశాలమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్న భవనాల్లో నివసిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలను మనుషులుగా కంటే పశువులు, జంతువులుగానే ఈయన చూస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనం అని చూపిస్తూ రాష్ట్ర పార్టీ కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ విశ్వక్‌సేన్ ఆధ్వర్యంలో మరియు రణస్థలం మండలం జనసేనపార్టీ మండల అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి సమక్షములో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వరావు, దాసరి బలరాం, వడ్డాది శ్రీనువాస్, ఇజ్జిరొతు రమణ, పోట్నూరు లక్ష్మునాయుడు, గోర్లె సూర్య, దన్నాన రవీద్ర, అప్పన్న, గోర్లె రాంబాబు, కోల్ల రాజేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనుకులు భారీయెత్తున హాజరవడం జరిగింది. స్ధానిక గ్రామం జనసైనికులు ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో సందర్శించడం జరిగింది.