కొయ్యురులో జగనన్న కాలనీల సందర్శన

అల్లూరి సీతారామరాజు జిల్లా, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ జగనన్న కాలనీ పిలుమేరకు కొయ్యురు జనసేనపార్టీ నాయకులు జగనన్న కాలనీల సందర్శన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యురు, జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన జగనన్న కాలనీలు సోషల్ ఆడిట్ మరియు సందర్శన విషయమై కొయ్యురు మండలం జనసేనపార్టీ నాయకులు మండలంలో గల రాజంద్రపాలెం గ్రామంలో సందర్శించారు. స్థానిక గ్రామస్తులకు లబ్ధిదారులతో విషయాన్ని ఆరాతీయగా 17మందికి జగనన్న పట్టాలు ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఆ స్థలాలు ఎక్కడున్నాయో మాకే తెలియదని లబ్ధిదారులు వాపోయారు, జగనన్న ఇళ్ల స్కీంలో ఒకటి రెండు ఇల్లు మాత్రమే కట్టుకున్నారు. కట్టుకున్న ఇళ్ళకి లక్షా పదివేలు మాత్రమే పేమెంట్ చేసి కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా లక్ష పదివేల రూపాయలు చెల్లించారు కానీ జగనన్న గృహ పధకం కింద ఎటువంటి బిల్లులు రాలేదని, కొందరికి ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదని లబ్ధిదారులు జనసేనపార్టీ నాయకులకు మొర పెట్టుకున్నారు. వచ్చిన అరకొర నగదుతో ఇల్లు పూర్తిగా నిర్మించడం సాధ్యం కాదని ప్రభుత్వవేమో లబ్ధిదారులకు 4లక్షలని ఇప్పటికి కేవలం కొందరికి మాత్రమే లక్ష పదివేల రూపాయలు బిల్లు చేసి మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేమెంట్ చేస్తామని అబద్ధాలు చెప్పడం ఏమిటో అర్థం కాదని ఇటువంటి విషయాలు ప్రజాప్రతినిధుల దృష్టికి ఎందుకు మాట్లాడారని ఎంతసేపు మా అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషణలకు తెగబడటం తప్ప ఏ పని చేతకాదని జనసేనపార్టీ నాయకులు విమర్శించారు. జగనన్నతోనే గిరిజనాభివృద్ది అంటే ఇదేనా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మేడం సమాధానం చెప్పాలని అనవసర భజనలు ఆపి సామాన్యుడి కల గృహ నిర్మాణంపై చిత్తశుద్దితో వ్యవహరించాలని హితవు పలికారు. రాష్ట్రంలో జగనన్న ఇల్లు పేరుతో అతిపెద్ద స్కామ్ కి తెరతీసారని ఇప్పుడు మా అధినేత ఈ జగనన్న ఇల్లు నిర్మాణంపై నాయకులకు ఆదేశాలు ఇవ్వడంతో వాస్తవాలు ఒప్పుకోలేక అసత్యాలు చెప్పలేక వైసీపీ నేతల తీరు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యిందని రానున్న రోజుల్లో ఈ పథకంలో ఇంకెన్ని వింతలు విచిత్రాలు చూడాల్సి వస్తుందో ప్రజలందరూ గమనిస్తుంటారని వైసీపీ ప్రభుత్వ తీరుని దుయ్యబట్టారు. మండల అధ్యక్షులు గూడెం లక్ష్మణ్ రావు, సాగెని బుజ్జి బాబు, వాసాం సాయిబాబు, గ్రామ పెద్దలు పీఠం ఆధిరాజు, లక్ష్మీ పాల్గొన్నారు.