వర్షం పడితే మా ఊరుకు దారేది: చిట్టి ఉదయ్ కుమార్

హుస్నాబాద్: వర్షం పడితే మా ఊరుకు దారేదని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కమ్యునిస్టు పార్టీలను కాదని, 70 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలను కాదని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ మా ఊరికి కూడా రోడ్డు తీసుకురాలేక పోతే మీకు రెండు పర్యాయాలు ఓటు వేసి ఏమి గొప్పలు జరిగాయి ఎమ్మెల్యే సతీష్ బాబు గారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు గారి ఊరి పక్కన ఉండే గ్రామం బొమ్మకల్. ఓటు రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాని గొప్పలు వాడుకున్న మీరు ఆ గ్రామ చుట్టుపక్కల అభివృద్ధి మాత్రం శూన్యం. మార్పు కావాలి చెప్పుకొనేటంత. ఇందుకు ప్రజావేదిక మాట్లాడటానికి బహిరంగ చర్చకు సిద్దం.. ప్రాణాలు పోతున్నా తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం లేకుంటే ఈ రోజు పోయే ప్రాణాలకు బాధ్యత వహిస్తారా?.. సతీష్ బాబు గారు 10 ఏళ్లుగా పూర్తి అవగాహనతో చెబుతున్న మా ఊరికి నిధులు వచ్చిన దాఖలాలు శూన్యం. ఏమైనా ఉంటే తెలియచేయండి. హుస్నాబాద్ నియోజక వర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు. గత 15 గంటలుగా మా ఊరికి రాకపోకలు లేవు, వర్షం పడితే మా ఊరికి దారేది సూటిగా ప్రశ్నిస్తున్నాము. సుత్తి లేకుండా సమాధానం చెప్పండి అంటూ ఉదయ్ కుమార్ అడిగారు.