కాలనీ నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో సమాధానం చెప్పాలి?

  • జగనన్న కాలనీలలో పాలకొల్లు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పాలకొల్లు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు #Failure of Jagananna Colony కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం గ్రామ ప్రజలకు శివదేవన్ చిక్కాల సమీపంలో ఇచ్చిన జగనన్న కాలనీ ఇళ్లను జనసేన ఆధ్వర్యంలో స్థలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక్కడ ఇచ్చినటువంటి 43 ఎకరాల ఇళ్ల పట్టాల స్థలంలో కేవలం 10 ఎకరాలు మాత్రమే పూడ్చడం జరిగింది మిగతా ప్రాంతం అంతా కూడా మోకాలు పైనే లోతు నీటిలో మునిగి ఉంది దీనిని పూర్తిగా పూడ్చలేదు, పైగా ఇక్కడ ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదు. ఈ కాలనీ నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో సంబంధిత శాఖ మంత్రి చెప్పాలి, చిన్నపాటి వర్షానికి బోటులు వేసుకుని ప్రయాణించే విధంగా తయారయ్యాయి. అంటే వీటిని ఎప్పటికీ పూడుస్తారు ఎప్పటికీ నిర్మించి ఇస్తారని జనసేన తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పినిశెట్టి అంజి, సాధనాలు దుర్గ బాబు, మంచిగంటి మారుతీ, తులా రామలింగేశ్వర రావు, నల్లమోతు ప్రసాదు, శిడగం సురేంద్ర, పోకల సాయి, కొమ్ములు దినేష్ విన్నకోట గోపి, వర్ధనపు వెంకటపతి, కెల్లా అశోక్ కుమార్, తామరడ సాయి, గురుజు, అయ్యప్ప, యాళ్ల రవీంద్ర, బిట్టా లక్ష్మీనారాయణ, షేక్ వల్లి మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.