పోలవరంలో జగనన్న కాలనీల సందర్శన

పెడన నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శనివారం గూడూరు మండలం, పోలవరం గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా, పెన్నా కో ఆర్డినేటర్ రావి సౌజన్య, కృష్ణా జిల్లా సెక్రటరీ మట్టా శివ పావని, కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ కూనసాని నాగబాబు, గూడూరు మండల అధ్యక్షులు దాసరి ఉమాసాయిరామ్, పెడన మండల అధ్యక్షులు ఊచా వెంకయ్య, బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, బంటుమిల్లి మండల జనరల్ సెక్రటరీ జన్యావుల నాగబాబు, గూడూరు మండల జనరల్ సెక్రటరీ నందా, గూడూరు గ్రామ జనసేన నాయకులు రాసింశెట్టి దుర్గారావు, కృత్తివెన్ను మండల ఉపాద్యక్షులు పాశం నాగమల్లేశ్వరావు పాల్గొన్నారు.