మరోసారి దీక్షకు సిద్ధమవుతోన్న దేవినేని.. గొల్లపూడిలో మళ్లీ ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 400వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపూడి సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధం కావడంతో పట్టణంలో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని దీక్షకు అనుమతి లేదని పేర్కొంటూ.. పట్టణంతోపాటు ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 కాగా, గొల్లపూడిలో నిన్న కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధమయ్యారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.