వరద ముంపులో లంక గ్రామాలు- లంక గ్రామాల ప్రజలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం గోదావరి వరదకు ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలను పరామర్శించి వారి యోగ క్షేమలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముమ్మిడివరం మండలం, తాళ్లరేవు మండలం లంక గ్రామలైన సలాదివరపాలెం, పొట్టితిప్ప, వాసాలతిప్ప, పిల్లంక చివారు కొత్తలంక ప్రాంతాలలోని ప్రజలను కలిసి ప్రభుత్వం నుండి సదుపాయాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని అందరినీ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే పలువురికి ఆర్థికసహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వరరావు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, గోలకోటి సాయి బాబు, దూడల స్వామి, సలాది రాజా, లంకెలపల్లి జమి, కొప్పిశెట్టి గణేష్, గుద్దటి విజయ్, పెన్నాడ శివ, గుద్దటి ప్రసన్నబాబు, గెడ్డం వెంకటేష్, గెద్దాడ ధనరాజు, సలాది సందీప్, సలాది మణికంఠ, సుంకర సునీల్, అబ్బిరెడ్డి తేజ, కూరాటి నందకిషోర్, బండారు గిరిధర ప్రసాద్, వలవల శ్రీను, ఇండుగుల రామకృష్ణ, వాసంశెట్టి బాబ్జి, దంగుడుబియ్యం తాతాజీ, గెడ్డం జానకిరామ్, సుంకర నాగ దుర్గా ప్రసాద్, నిమ్మకాయల మణికంఠ, పాము లోవరాజు, దొమ్మేటి లక్ష్మణ్, యనమదల షిరిడి, గుత్తుల లక్ష్మణ్ మొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.