ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంబటి!

గుంతకల్ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు మా అధ్యక్షుల సినిమా పైన నీచమైన మాటలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నామని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు మా అధ్యక్షులు గారు ఒక్క సినిమా మేకప్ వేసుకుంటే ఎన్నో లక్షల మందికి ఉపాధి దొరుకుతుందిది, సినిమా సెట్లో లైట్ మ్యాన్ నుండి సినిమా ధియేటర్ స్కూటర్ టికెట్ ఇచ్చే బాయ్ వరకు ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రాంబాబు. లేదంటే రానున్న రోజుల్లో భారీ మూల్యం ఒక్కొక్కరు చెల్లించక తప్పదు. అంబటి నీన్ను ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు, అంబటి సినిమా నిర్మాతకి కలెక్షన్లు చెప్పడానికా అ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు అంబాటి లేకుంటే సుకన్య సంజనాతో కలిసి విహారయాత్రలకు ఏమన్నా వెళ్తున్నావా? ఈ రోజు సినిమాలు తీసుకుంటూ ఎంతోమంది కౌలు రైతులు పంట గిట్టుబాటు ధర లేక తెచ్చిన అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం అందిస్తూ వెళ్తున్నారు. ఇదే సినిమా తీసి మీరు ఇన్ని రోజులు రాజకీయంగా ఏమి సాధించారో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అంబటి? అది చేతకాదు పేరుకు మంత్రులే గాని మీకు నచ్చిన సుకన్య, సంజన అలాంటి మహిళలతో కాలయాపన చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక రైల్వేటేషన్ జంక్షన్లో నా కళాసి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది అయితే రాష్ట్రాలు మారి పొట్టకూటి కోసం బ్రతుకుతున్నారు. మరి కొంతమంది అయితే చాలీచాలని జీతాలతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పనిచేసుకుంటున్నారు. మీరు జనవరికి ఇస్తానన్న క్యాలెండర్ మారుతున్నాయి గానీ ఉద్యోగాలు ఏమైనా దానిమీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవయ్యా! సినిమా కోసం ఢిల్లీకి పోతాడంట కర్మరా! ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇప్పుడైనా తెలుసుకొని ఇలాంటి వారికి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆ జనసేన పార్టీ అధ్యక్షులు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు మా అధ్యక్షులు సినిమాపై నీచమైన మాటలు మాట్లాడుతున్న అంబాటి రాంబాబూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నామని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, జనసేన పార్టీ నాయకులు, ముత్తు, వీరమహిళ ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.