పవన్ కళ్యాణ్ ఆశయాల మెచ్చి జనసేనలో చేరిన యువత

వజ్రకరూరు నియోజకవర్గం: జనసేన పార్టీ మండల అధ్యక్షులు అచ్చనాల కేశవ్ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీలో వజ్రకరూరు మండలం చాబల గ్రామానికి చెందిన యువత నరేంద్ర, రాజా, విజయ్, రాజశేఖర్, శివ కుమార్, అంజి, మోహన్, రాజేష్, అంజినేయులు, విష్ణు, తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చనాల కేశవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి దాన్యవాదములు తెలుపుతూ.. మండలంలో అలాగే నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి దోహదపడాలని తెలియజేసారు. ఈ కార్యక్రమములో మండల ఉపాధ్యక్షులు హరి శంకర్ నాయక్, మండల కార్యదర్శి సూర్యనాయక్ మండల నాయకులు పాల్గొన్నారు.