క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మత్స పుండరీకం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం వివిధ గ్రామలకు చెందిన జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందచేసారు. అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ జే.ఎస్.పి అనగా (జె)జనం కోసం (ఎస్)స్థాపించిన (పి)పార్టీ అని అన్నారు.

హలో ఆంధ్రప్రదేశ్ – వెల్కమ్ జనసేన
హలో పాలకొండ – బై బై వైఎస్సార్సీపి
పవన్ వస్తాడు – పాలన మారుస్తాడు
ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మారుస్తాడు అంటూ నినాదాలు చేసారు. మన ధ్యేయం జనసేన పార్టీ విజయం – మన లక్ష్యం పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడం అని జనసైనికులకు మత్స పుండరీకం సూచించారు. మీరు మీ మీ గ్రామంలో రైతులవద్దకు వెళ్లి ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు అందాయ లేదా, గ్రామంలోని కౌలురైతులకు అండగా ఉండాలని కోరారు. నరిసిపురం జనసైనికుడు చింత గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలను కలసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు మూడు వేల మంది కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ముపై కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా పంచుతున్నారు. పవన్ కళ్యాణ్ సేవలను ప్రజలకు తెలిసేవిధంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొండి సుమన్, వాన కైలాస్, ముంజేటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.