వారాహి విజయయాత్రలో వైద్య సేవల నిమిత్తం మెడికల్ కిట్స్, మెడిసిన్స్ అందజేత

నూజివీడు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు సహకారంతో జనసేన నాయకులు బజారు నందేశ్వర్, పాశం నాగబాబు వారాహి విజయయాత్రలో వైద్య సేవలు అందించే అంబులెన్స్ జనహితకి 30 వేల రూపాయల మెడికల్ కిట్స్, మెడిసిన్స్ నియోజకవర్గ బర్మా ఫణిబాబు చేతుల మీదుగా నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున వారాహి మెడికల్ టీమ్ సభ్యులు, రాష్ట్ర డాక్టర్స్ సెల్ టీమ్ వైస్ ప్రెసిడెంట్, యర్రగొండపాలెం ఇంచార్జి డాక్టర్ పాకనాటి గౌతమ్ కు అందచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, నూజివీడు టౌన్ నాయకులు తోట వెంకట్రావు, సురిశెట్టి శివ, ఏనుగుల చక్రి, నాయుడు కిషోర్, చాట్రాయి మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ పాల్గోన్నారు.