సదువుకు దూరమై సావుకు దగ్గరవుతున్న ఐఐఐటి: సుంకెట మహేష్ బాబు

భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో జాదవ్ బబ్లు విద్యార్థి మరణం చాలా భాదకరమని దీనిని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి మరణానికి గల కారణాలపై విచారణ జరిపి, దీనికి భాధ్యత వహించాల్సిన అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏమి జరుగుతుందో అని విద్యార్థుల తల్లి తండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం జరుగుతుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఐటీ మంత్రి, విద్యా శాఖ మంత్రి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి వెళ్ళారు. కానీ పరిస్థితి ఇంకా అలాగే వుంది. అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా పిట్టల్లా రాలిపోతున్నా ముఖ్యమంత్రికి సోయ రావడం లేదు అనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల పేరిట డబ్బులు వృద చేస్తుంది. కాని విద్యా వ్యవస్థలను పటిష్టం చేయడానికి అవసరమైన నిధులను కేటాయించడం లేదు. బంగారు తెలంగాణలో విద్యావ్యవస్థ కుంటు పడిపోతుంది. అసలు బాసర ట్రిపుల్ ఐటీ వుంటదో పోతాదో అనే అనుమానం వ్యక్తం అవుతుంది. యునివర్సిటీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని దానికి సంభందించిన డబ్బులు కట్టాలని ఒత్తిడికి లోనవుతున్నారనీ విద్యార్థుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇలా చాలా విషయాల్లో విద్యార్థులు ఆందోళన చెంది ప్రాణాలు కోల్పోయి అష్ట కష్టాలు పడుతుంటే కెసిఆర్ సారు ఒక్కసారి కూడా దీనిపై స్పందించక పోవడం చాలా విచారకరం. వెంటనే బాసర ట్రిపుల్ నీ సందర్శించి విద్యార్థి మృతిపై విచారణ జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటలు చేయడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నామని మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువజన సంఘం నాయకులు రామోజీ వార్ గంగ ప్రసాద్ పాల్గొన్నారు.