పకోడీ దద్దమ్మ వైసిపి నేతలు మెగాస్టార్ కు క్షమాపణలు చెప్పాలి: త్యాడ రామకృష్ణారావు

  • విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు)
  • మెగాస్టార్ కాలిగోటికి ఈ వైసిపి పకోడీ నేతలు సరిపోరు
  • వైసిపి నేతలు పాలనలో విఫలం

విజయనగరం: మాజీ కేంద్ర మంత్రి వర్యులు, కళామ్మతల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండువందల రోజుల విజయోత్సవ వేడుకుల్లో గ్లామర్ ఉన్న సినీపరిశ్రమను ఉద్దేశించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని, అధికార పార్టీకి చెందిన మంత్రులకు ఎన్నో బాధ్యతలు ఉంటాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించకుండా హీరోల పారితోషికం కోసం ఎందుకు అని చేసిన వాఖ్యలకు వైసిపి నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు మెగాస్టార్ చిరంజీవిపై చేసిన అనుచిత వాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, మెగాస్టార్ చిరంజీవికి ఈ వైసిపి పకోడీ నేతలు క్షమాపణలు చెప్పాలని విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, త్యాడ రామకృష్ణారావు(బాలు) బుదవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసిపి నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం యువతకు, ప్రజలకు ఉపాధికోసం ఒక్క పరిశ్రమ కూడా తెలేకపోయారని, గుంకలంలో జగనన్న ఇల్లుల నిర్మాణం చేపట్టలేకపోయారని, ఈ పకోడీ నేతలు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో విఫలం చెందారని, ఇటువంటి చేతకాని పకోడీ దద్దమ్మలు సేవకు ప్రతిరూపమైన మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వాఖ్యలను వెనక్కు తీసుకోని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం తన గళాన్ని వినిపించారని, కరోనా కష్ట కాలంలో ఈ పకోడీ నేతలు ఇళ్ళల్లో పడుకుంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ లను అందించిన మహానుభావుడు మెగాస్టార్ అని, చిరంజీవి కాలిగోటికి ఈ పకోడీ నేతలు సరిపోరని దుయ్యబట్టారు.