గుంటూరులో ఘనంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గుంటూరు పట్టణంలోని అరండల్ పేట శ్రీ నండూరి రీజెన్సీలో కాపు సంక్షేమ సేన 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించినారు. వేడుకలలో భాగంగా గుంటూరు జిల్లా రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు యడ్లపల్లి దానారావు కేక్ కటింగ్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, నగర కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరత్తయ్య మాట్లాడుతూ కాపు సంక్షేమ సేన స్థాపించి నేటికి 3 సంవత్సరాలు అయినది. రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య నాయకత్వంలో ఏన్నో మంచి సేవాకార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి కె.యస్.యస్. విస్తృతంగా పనిచేయాలని కోరినారు. కాపు సంక్షేమ సేన గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డేగల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా మా జిల్లా అధ్యక్షులు బండి కల్లు శ్యామ్ ప్రసాద్ కు, రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్యకు నా కృతజ్ఞతలు తేలియజేయుచున్నాను. రానున్న రోజుల్లో గుంటూరు పార్లమెంటు కమిటిని పూర్తి స్థాయిలో కమిటీ నిర్మాణం చేపట్టి జనసేన పార్టీని రానున్న ఎన్నికల్లో విజయపథంలో నడిపించటానికి మాశక్తి వంఛన లేకుండా కృషి చేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో మా అధినేత హరిరామజోగయ్య పిలుపు మేరకు ఏకార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ఆయన ఆశయం నేరవేరే విధంగా కార్యకర్తలు కృషి చేయగలరని ఈసందర్భంగా ఆయన కోరినారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు, గుంటూరు జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూరగడ్డ ఓమ్ కోటేశ్వరరావు, జిల్లా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూరగడ్డ చిరంజీవి, గాదె లక్ష్మణరావు, బిట్రగుంట శ్రీనివాసరావు, కలగంటి శ్రీనివాసరావు, ఇంకొల్లు శంకరరావు, బండి రామప్రభు, అంకిరెడ్డి వాలీ సుగుణరావు గున్నం సాయి, పులిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.