గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులెక్కడ?: చందక అనీల్

  • పంచాయతీల నిధుల మల్లింపుపై జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా

పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం వైఖరినీ ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు చందక అనీల్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలకు కేటాయించిన సుమారు 7000 కోట్లు నిధులు ఎక్కడా..? ఆ నిధులను ఎటు మళ్ళించారు..? వివరణ ఇవ్వండని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 13700 గ్రామపంచాయతీలలో కనీస మౌళిక సదుపాయాలు లేవు, గ్రామ సచివాలయాలతో పంచాయతీలకు, పంచాయతీ వ్యవస్థకి ముప్పు పొంచిఉంది. మళ్లించిన నిధులు గురించి రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని చందక అనీల్ కోరారు. ఈ మహాధర్నాలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆగూరు మణి, పాటి శ్రీనివాసరావు, బంకూరు పోలినాయడు పట్టణ సీనియర్ నాయకులు చందక అనీల్, రెడ్డి కరుణ, బంటు శిరీష్, గుంట్రెడ్డి గౌరీ, సిరిపురపు గౌరీ, ఖాతా విస్సు, బొనెల గోవిందమ్మ, చిట్లు గణేష్, మండల శరత్, దాలి నాయుడు, గంట్యాడ స్వామినాయుడు, పరుచూరి రమణ, రగుమండల అప్పలనాయుడు, పైలా శ్రీను, కేశవ, కర్రీ మణి, అన్నబత్తుల దుర్గా ప్రసాద్, ప్రసాద్ తదితరులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.