అరట్లకట్ట గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, అరట్లకట్ట గ్రామంలో గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్ ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. అరట్లకట్ట గ్రామంలో పర్యటన చేస్తున్న నానాజీకి ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు ముఖ్యంగా గ్రామంలో గ్రామంలో ఎస్సీ పేట దగ్గర నుండి దుర్గాదేవి వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయింది,
గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, స్మశాన వాటికలో మౌలిక వసతులు లేవు. షెడ్ నిర్మాణం చేయవలసి ఉంది. బ్యాంకింగ్ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్య. రోడ్లు సరిగా లేవు. రైతు కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. జగనన్న కాలనీలలో సదుపాయాలు లేక రోడ్లు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు అవుతున్నారు. గ్రామంలో వైసీపీ వర్గ విభేదాలు వల్ల గ్రామ అభివృద్ధి కుంటుబడింది.(పాత వైసిపి వర్గం, కన్నబాబు వర్గంగా విడిపోయాయి) పాత వైసిపి వర్గానికి చెందిన సర్పంచ్ కు అధికారులు సహకారం అందించవద్దని ఎమ్మెల్యే పిలుపు. జగనన్న ఇళ్ల నిర్మాణం కొరకు తీసుకున్న భూములలో అవకతవకలు. వర్గ పోరుతో( వైసిపి) గ్రామంలో ఇప్పటికీ లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ జరగలేదు. వీధిలైట్లు సరిగా వెలగడం లేదని గ్రామస్తు పంతం నానాజీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.