జనసేన ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ

చిలకలూరిపేట నియోజకవర్గం: నాదెండ్ల మండలం, బుక్కాపురం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు పెంటేల బాలాజీ, బుక్కాపురం గ్రామ పోలిమేర నుండి జనసైనికులు, వీరమహిళలు, బాలాజీ గారినీ మేళ తాళాలతో, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. తదనంతరం బాలాజీ గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు, మార్గమధ్యలో గ్రామ యువత, మహిళలు తమ గ్రామంలోని ప్రధాన సమస్యలైన తాగునీటి కొరత రోడ్లు మరమ్మత్తులు గురించి విన్నవించుకున్నారు, వారి సమస్యలను విన్న బాలాజీ వెంటనే గ్రామ పంచాయతీ సెక్రెటరీకీ ఫోన్ చేయగా వారు స్పందించి సర్పంచ్ అందుబాటులో లేనందువల్ల ఆగిందని త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని తెలియచేసారు. గ్రామంలో ఓ.ఎన్.జి.సి వారి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ మరియు హాస్పిటల్ నిర్మితమై చాలా సంవత్సరాలనుండి నిరుపయోగంగా ఉన్నాయని తెలియ చేశారు. వైద్య మంత్రి మన నియోజకవర్గం వారు అయిననప్పటికి నిర్మించి ఉన్న హాస్పిటల్స్ నిరూపయోగంగా ఉంచటం బాధాకర విషయం అని బాలాజి అన్నారు. ఎంతో ఘనంగా మన నియోజకవర్గంలో మొదలు పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కోసం పక్క ఊరుకి వెళ్లాల్సి వస్తుంది అని పలువురు విన్నవించుకున్నారు. రాబోయేది మన జనసేన ప్రభుత్వమే అని మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంచి నీటి ట్యాంక్ కు వాటర్ సప్లై ఇస్తామని, నిరూపయోగంగా ఉన్న నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రులులో డాక్టర్ లను ఏర్పాటు చేయిస్తామని బాలాజి హామీ ఇచ్చారు. అప్పటిలోగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా వంతుగా జనసైనికులు ద్వారా కార్యక్రమాలు చేసి గ్రామ సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. అనంతరం నాదెండ్ల మండల పిచ్చయ్య మాట్లాడుతూ.. నాదెండ్ల గ్రామంలో జనసేన పార్టీ దూసుకు వెళుతుందని చెప్పారు. యువత, యువకులు, మహిళల ఉత్సాహం చూస్తుంటే నాదెండ్ల మండలంలో జనసేన పార్టీ జండా ఎగరవేయటం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు గోవిందు గణేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, అని ఎలాగైతే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సంపాదనను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారో అలాగే మన చిలకలూరిపేట నాయకులు పెంటేలా బాలాజీ గారు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆశీస్సులు అందుకుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచియ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి ఎల్ బి నాయుడు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామరావు, మల్లా కోటేశ్వరరావు, కార్యదర్శి సుబ్బారావు, చిలకలూరిపేట మండల నాయకులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, వీర మహిళ అమరేశ్వరి, పట్టణ నాయకులు అరుణ్, సన్ని, గోవిందు గణపతి, పగడాల, అనిల్, నాదెండ్ల మండల కార్యదర్శి నాని, చెంచు ఆంజనేయులు, అల్లం రాజా మరియు గ్రామం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.