నరేంద్ర కుటుంబానికి అండగా జనసేన

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి ఆలయంలో సానిటైజేషన్ లో పనిచేసే నరేంద్ర అనే ఉద్యోగి సోమవారం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా చనిపోవడం చాలా బాధాకరం. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మంగళవారం ఉదయం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వెళ్లి మార్చురీ లోని నరేంద్ర మృత దేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర కుటుంబ సభ్యులు ఆలయ అధికారుల నుండి ఎలాంటి హామీ, బరోసా ఇవ్వలేదని చనిపోవడానికి గల కారణాలు సి.సి టీవీ విడియోలు బయట పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సబ్యులకు జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని, తక్షణమే ఆలయ ఈఓ మరియు చైర్మన్ ఆ కుటుంబానికి నష్ట పరిహారాన్ని 25 లక్షలు అయినా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆలయంలో పెర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలా కాదని కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తే జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉండి పోరాడుతామని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్, వేణు గోపాల్, వెంకట రమణ యాదవ్, గణేష్ , చెంచు ముని, వెంకటేష్ , గురవయ్య తదితరులు పాల్గొన్నారు.