కూకట్పల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కూకట్పల్లి, 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నియోజకవర్గంలోని పలు డివిజన్లు కె.పి.హెచ్.బి టెంపుల్ బస్ స్టాప్, రమ్య గ్రౌండ్ 3 ఫేస్, భరత్ నగర్, బాలానగర్, ఫతేనగర్, బోయిన్పల్లిలో ఉదయం 9.00 గంటల నుండి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, నాగేంద్ర, వెంకటేశ్వరరావు, నాగరాజు, వేముల మహేష్, పోలిశెట్టి సురేంద్రబాబు, వీర మహిళలు కావ్య, భాగ్యలక్ష్మి వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, మల్లేశ్వరి మరియు డివిజన్ ప్రెసిడెంట్లు మరియు జనసేన శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.