జీడి రైతుల ధర్నాకు జనసేన మద్దతు

ఎచ్చెర్ల నియోజవర్గం: కవిటి మండల హెడ్ క్వార్టర్లో జరిగిన ఉద్దానం జీడి రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ లక్ష సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా జీడి రైతుల కన్వీనర్ మరియు రైతు సంఘం సభ్యులు చేస్తున్న ధర్నాలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహారా, కుసుంపురం జనసేనపార్టీ సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్, జనసేన నాయకులు బడగల రామకృష్ణ, బల్లెడ ప్రవీణ్, బడగల దేవరాజు, ప్రవీణ్ బెహారా, జుత్తు చలపతి, రాజశేఖర్ మాస్టర్, వాసు మరియు బీజేపీ నాయకులు నల్లాన నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో బాగస్వాములై ఉద్దానం జీడి రైతులకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కోరారు.