ఇప్పటం గ్రామ జనసేన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం

మంగళగిరి నియోజకవర్గం: తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామ జనసేన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు హాజరవటం జరిగింది. అనంతరం నూతనంగా నియమితులైన ఇప్పటం గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. నూతనంగా నియమితులైన ఇప్పటం గ్రామ కమిటీ సభ్యులుగా: అధ్యక్షునిగా సాధు కొండలరావు, గౌరవ అధ్యక్షుడుగా గాజుల రాంబాబు, ఉపాధ్యక్షులుగా దబేరా నాగరాజు, తిరుమల శెట్టి రాంబాబు, ప్రధాన కార్యదర్శులుగా శంకర్శెట్టి మల్లికార్జునరావు, ఇండ్ల ఫణి కుమార్, గాజుల శివరంజని, యేమి నేని స్వప్న, కార్యదర్శులుగా బెల్లంకొండ వెంకటనారాయణ, ఇండ్ల లక్ష్మి, కాటూరి శివలక్ష్మి, శంకరశెట్టి రవితేజ, కోసూరి శివరామ గోపికృష్ణ, తిరుమలశెట్టి రమేష్, ఇండ్ల నాగరాజు, తిరుమల శెట్టి రవి, తిరుమల శెట్టి ప్రసాద్, తిరుమల శెట్టి ఫణీంద్ర, మాన్యం నరహరి, గాజుల చంద్రబాబు, వేముల సంతోష్, ఇండ్ల శివ, ఇండ్ల గోపి తదితరులు. ఇప్పటం గ్రామ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్స్ గా శంకర్ శెట్టి కృష్ణమోహన్, తిరుమల శెట్టి సతీష్, సభ్యులు: సోమరాజు పల్లి బాజీ కృష్ణ అప్పారావు, తిరుమల శెట్టి బుషేంద్ర, బెల్లంకొండ బిందు, ఇండ్ల త్రినాథ్ బాబు, ఇండ్ల గోపి, తిరుమల శెట్టి హరి, ఇండ్ల త్రివిక్రమ రావు, ఇండ్ల కొండలును నియమించారు. అనంతరం మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు మన ఇప్పటం గ్రామం గురించి తెలియని వారు ఎవరూ లేరు ఎందుకంటే 2022లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ నిర్వహించడానికి మా స్థలాన్ని ఇస్తామంటూ ఇప్పటం రైతులు ముందుకు రావడం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పడం గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలని 50 లక్షలు ప్రకటించడం. అలానే ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతుల ఇల్లు అక్రమంగా కూల్చిన ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు వృధా కాకూడదని గ్రామస్తులందరూ కలిసి అదే గ్రామంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేయటం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి ప్రకటించిన 50 లక్షల రూపాయలతో రానున్న రోజుల్లో కొనుగోలు చేసిన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జనసేన పార్టీ ఫాఛ్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుందని అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుగుతుందని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటం గ్రామాన్ని ఒక మోడ్రన్ గ్రామంగా పవన్ కళ్యాణ్ గారు మారుస్తారని అన్నారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టాలంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందామని, అలాగే నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి ఎవరు ఉన్నా వారి గెలుపు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజవర్గ అధ్యక్షులు మరియు ఎంటిఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమల శెట్టి కొండలరావు, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీధర్ బాబు, తాడేపల్లి మండల కార్యదర్శి ఇండ్ల జగదీష్, ఇప్పటం గ్రామ నాయకులు తిరుమల శెట్టి నరసింహ, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.