చిట్వేలిలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు: చిట్వేలి మండల జనసేన కార్యాలయంలో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిరంజీవి యువత చిట్వేలి మండల అధ్యక్షుడు తుపాకుల పెంచలయ్య, జనసేన పార్టీ యువ నాయకుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో, ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ పర్యవేక్షణలో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ నెలకొల్పిన గొప్ప మానవతావాది, కరోనా సమయంలో ఎందరికో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయం చేసిన ఆపద్బాంధవుడు అలాగే ప్రతి జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఆక్సీజన్ సిలిండర్లు సరఫరా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదాసు నరసింహ, చిట్వేలి మండల చిరంజీవి యువత అధ్యక్షుడు తుపాకుల పెంచలయ్య, యువ నాయకులు షేక్ రియాజ్, కంచర్ల సుధీర్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ మాదాసు శివ, సువారపు భాను ప్రకాష్, తుపాకుల సురేంద్ర, తుపాకుల రవి, నారకట్ల గంగయ్య, తుపాకుల మనోహర, తుపాకుల కిరణ్, నీలి కృష్ణ, శివరాం, కొనిసెట్టి రాజా ప్రకాష్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.