దర్శి పట్టణంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

దర్శి నియోజకవర్గం: డా. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం దర్శి నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, దర్శి నియోజకవర్గం సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాశి కొండయ్య, ముండ్లమూరు మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల సురేంద్ర, ఉల్లి వెంకీ, నూగుల మల్లిఖార్జున రావు, తోట రాయుడు, ఉప్పు అంజి, తిరుమల నారాయణ, ఎస్.కె వెంకటేష్, పుప్పాల శ్రీకాంత్, చొప్పవరపు తేజ, జనసైనికులు & మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.