మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకున్న ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం నియోజవర్గం: మార్కాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయం నందు జరిగిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ సాధిక్, పేరూరి రమేష్, కాపు సంఘం నాయకులు రఘుపతి శివ, శిరిగిరి శ్రీనివాసరావు, బెల్లంకొండ రామకృష్ణ, మట్టం శ్రీనివాసులు, పవన్, తిరుపతయ్య, యాదగిరి శివ, కిషోర్, శ్రీకాంత్, ఆదినారాయణ, సోను, కుమార్ మరియు జనసేన అభిమానులు పాల్గొనడం జరిగింది.